మార్కు15:15. పిలాతు జనసమూహను సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయనప్పగించెను.
యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలియులను యూదులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారు.
ఏ జాతి కొరకు ఆయన వచ్చారో వారే ఆయనను నిర్లక్ష్యం చేసి ఆయనకు శిక్ష విధించి పాపాత్ముడు నరహంతకుడునునైన బరబ్బను విడుదల చేయాలని కోరుకున్నారు.
ఆయనకు శిక్ష పడెలా కోరింది ఎవరు?
మార్కు15:1, ఉదయము కాగానే ప్రదానయాజకులును పెద్దలును శాస్త్రులును మహసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు ఆప్పగించిరి.
1)యాజకులు
2)పెద్దలు
3)శాస్త్రులు
యాజకులు అంటే యాజకత్వం చేసేవారు
(దేవుడికి దూపం హారతి నైవేద్యం అర్పించెవారు) ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు గురించి తెలిసిన వారు.
పెద్దలు అంటే, మంచి చెడులు తెలిసి ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్ణయం తీసుకునే వారు.
శాస్త్రులు అంటే, తెలివైన వారు జ్ణానవంతులు పండితులు.
ఈ ముగ్గురు కూడా చాలా గొప్ప వారు అయినా సరే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న దైవత్వం చూడలేక పోయారు, తెలుసుకో లేక పోయారు.
యేసుక్రీస్తు ప్రభువును వారు అర్థం చేసుకోలేకపోయారు.
అందుకే
వారు యేసుక్రీస్తు ప్రభువును నిర్లక్ష్యం చేసారు. కాబట్టి ఆయన సర్వమానవుల రక్షణ కొరకు ఆయన తన రక్తాన్ని చిందింసారు.
ఈ విషయం తెలియక అప్పటి వారు చేసిన విధంగానే ఈ రోజుల్లో ప్రజలు కూడా పరిశుద్దుడైన యేసుక్రీస్తు ప్రభువును నిర్లక్ష్యం చేసి పాపాన్ని కోరుకుంటున్నారు.
వారు ఈ యేసు మాకొద్దు బందిపోటు దొంగ నరహంతకుడు నైన బరబ్బ మాకు కావాలి అన్నారు. అప్పటికి బరబ్బ ఖైదీ గా ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎప్పుడు అన్యాయం చేయలేదు, వారిపట్ల ఆయన ఎన్నో అద్భుతకార్యలు చేసారు.
గ్రుడ్డి వారికి చూపును, చెవిటి వారికి వినికిడిని. మూగవారికి మాట్లాడే శక్తిని, ఇలా ఎన్నో అద్భుతకార్యలు వారిపట్ల ఆయన చేసారు. రోగాలనుండి వారిని విడిపింసారు,
దయ్యాలనుండి వారిని విడిపింసారు,
చనిపోయినవారిని కూడా ఆయన బ్రతికింసారు,
ఆయన వారికి ఆహారం కూడా పెట్టారు.
ఆయన వారిని ప్రేమించి ఇన్ని కార్యాలు వారిపట్ల చేస్తే,
వారు,వారిని బాధ పెట్టి దోచుకోని వారిని హింసకు గురి చేసి శ్రమపెట్టి వారిప్రాణాలు తీసిన నరహంతకుడైన బరబ్బను మాకు విడుదల చేసి ఈ యేసును సిలువ వేయమని వారు కోరుకుంన్నారు.
ఈ దినాలలొ మనము ఎలా ఉన్నాము మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుడు నైన ఆ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు రాకుండా ఆయనను నిరాకరిస్తు,
ఆనాటి యూదుల వలె వారు బరబ్బను కోరుకుంనట్లుగా, నీవు కూడా నాశనానికి నడిపించే ఈ లోకాన్ని కోరుకుంటున్నావా.
ఈ లోకం పాపము తో నిండి ఉంది,
ఈ లోకంలో పుట్టిన మనుష్యులందరు పాపులె.
అందుకే భక్తుడైన పౌలు అంటున్నాడు,
రోమా3:23,లొ
ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేక పోవుచున్నారు.
రోమా3:11,12,లొ
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు
దేవుని వెదకువాడెవడును లేడు,
అందరును త్రొవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.
ఈ పాప లోకంలో ఉన్న అందరు పాపులె,
పాపము తో ఉన్న మనము పరిశుద్దుడైన దేవుణ్ణి ఎలా చూడగలము,
ఆ దేవుడుండె పరలోక పట్టణం,
ఆ స్వర్గమనే మహ నగరం ఎలా చూడగలము, ఎలా చేరుకోగలము?
మనము ఆ ప్రభువును చూడాలంటే
ఆ పరలోకం ఆ స్వర్గంలో ఉండాలంటే,
మన పాపాలు క్షమించబడి మనము నీతిమంతులుగా తీర్చబడాలి.
మనలను నీతిమంతులుగా చేసేది ఎవరు?
రోమా3:24-26వరకు
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనుపరచవలెనని! క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటికాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.
ఈదినమే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు దగ్గరకురా, ని పాపాలు క్షమించబడతాయి నిత్యజీవం నీవు పొందుకుంటావు.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయును గాక.
God bless you
No comments:
Post a Comment