Search Blogger

Saturday, 22 September 2018

ఉపవాసం లో ఉన్న శక్తి

ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే 
మనము ఆత్మీయంగా బలపడడానికి 
దేవునికి మరింత దగ్గర కావడానికి 

మనము దేవునికి దగ్గరగా ఉంటే, 
సాతానుకు దూరంగా వుంటాం 
దేవునికి దగ్గరగా లేకపోతే 
సాతానుడు మనము రమ్మనకుండానే వాడే మన దగ్గరకు వచ్చేస్తాడు, 

మనము కడవరి కాలంలో భయంకరమైన 
దినాలలో ఉన్నాము, 
దేవుని యొక్క రాకడకు అతి సమీపంలో మనము ఉన్నాము, 

ఈ యుగం సమాప్తి కాబోతుంది 
ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు 
మనమందరం ఆ తీర్పు లో లేకుండా ఉండాలంటే, 
మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి 
ఆయనకు దగ్గరగా మనము జీవించాలి. 

1 పేతురు 5:8,9, వచనాలు 
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీవిరోదియైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.

అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు 

మన విశ్వాసాన్ని పాడుచెయాలని, 
మన భక్తి జీవితాన్ని నాశనం చేయాలని, 
మనలో భేదాలు పుట్టించి కక్షలు, అసూయ, స్వార్థాన్ని పుట్టించి మనలను దేవునికి దూరం చేసి వాడితోపాటు మనలను కూడా నరకానికి తీసుకుపోవలని వాడు తిరుగుచున్నాడు, 

అందుకే దేవుడు భక్తుడైన పేతురు ద్వారా మనతో మాట్లాడుతున్నారు, 
మీరు వానిని ఎదిరించండి అని ఆయన మనతో మాట్లాడుతున్నారు, 

మనము అపవాదిని ఎదిరించాలి 
మనము అపవాదిని ఎదిరించాలంటె మనకు 
బలం కావాలి, శక్తి కావాలి,
మనకు బలం కావాలంటే మనము ఆత్మీయ
ఆహారం తీసుకోవాలి

అపవాదిని ఎదిరించడానికి దేవుడు మూడు మాటలు చెప్పారు. 

1) నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి. 
2) మెలకువగా ఉండాలి. 
3) లో కమందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. 
4) విశ్వాసమందు స్థిరులై ఉండాలి.

1) నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి
వాడు మనలను మోసపరచడానికి 
రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు
ఏదో ఒక వెర్రి చూపిస్తూ ఉంటాడు 

వాడి ప్రయత్నాలకు మనము లొంగిపోకుండా
నిబ్బరమైన మనస్సు గలవారమై దేవుని మీద అనుకోవాలి

వాడు ఏదేనులొ అదాము అవ్వను ఇలాగే మోసం చేసాడు 

2) మెలకువగా ఉండాలి 
   మత్తయి 25:1-13 వరకు 

3) ఏం జరుగుతుందో తెలుసుకోవాలి
  అలాగని ప్రతి చెత్త విషయాలు కాదు
  ఏం తెలుసుకోవాలి మనము అంటే 
  మత్తయి 24:3-8, వరకు 
  
4) విశ్వాసమందు స్థిరులై ఉండాలి
    యోహను 4:46-53 వరకు 
    మార్కు 5:21-43 వరకు 

No comments:

Post a Comment

దేవుడు మనపక్షమునుండగా మనకు విరోధి ఎవడు?

Romans(రోమీయులకు) 8:31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?