Search Blogger

Tuesday, 25 September 2018

యవనస్తుల దేవుని ఆశీర్వాదం ఎలా పొందు కోవాలి

మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో మీకు శుభములు.
యవనస్తులు దేవుని ఆశీర్వాదాన్ని ఎలా పొందు కోవాలి అనే విషయం గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథము లో నుండి కొన్ని వచనాలు చూద్దాం.
Ephesians(ఎఫెసీయులకు) 6:1,2,3

1.పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.
2.నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,
3.అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.

అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసులో దేవుని సంఘం లో ఉన్న యవనస్తులకు ఈ మాటలను తెలియజేశారు.
ఎఫెసు సంఘము లో యవనస్తులు ఎలా ఉన్నారు అంటే తల్లిదండ్రులకు ఏమాత్రం విధేయులుగా లేకుండా
తల్లిదండ్రుల మాట వినని వారు గా
తల్లిదండ్రులను బాధపెట్టే వారు గా ఉండి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేని వారు గా అక్కడ యవనస్తులు ఉన్నారు.
అందుకే పౌలు గారు ఈ మాటలను వారికి తెలియజేస్తున్నారు.
యవనస్తులైన మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి అంటే
మీకు మేలు కలగాలి అంటే
మీ జీవితంలో మీకు అంతా మంచి జరగాలి అంటే
మీరు మొదటిగా ఈ రెండు పనులు చేయాలి.
1) తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి
2) తల్లిదండ్రులను ప్రేమ తో గౌరవించాలి

ఒక్కసారి మనము (ఎఫెసీయులకు)6:1వచనాన్ని గమనిద్దాం

పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.
అని దేవుని వాక్యము తెలియజేస్తుంది.
ధర్మము అంటే న్యాయం, అధర్మం అంటే అన్యాయం అని అర్ధం.
న్యాయంగా జీవించే వారిని చూసి అందరూ సంతోషిస్తారు
అందరూ మెచ్చుకుంటారు.
దేవుడు సంతోషిస్తాడు దేవుడు కూడా మెచ్చుకుంటాడు.
అన్యాయంగా జీవించే వారిని చూసి అందరూ అసహ్యించుకుంటారు, దేవుడు కూడా అసహ్యించుకుంటాడు.
మీ తల్లిదండ్రుల మాట వింటూ వారికి విధేయులై మీరు జీవిస్తుంటే
మీరు న్యాయంగానే జీవిస్తున్నారు.
వారి మాట వినకుండా వారికి అవిధేయులై మీరు జీవిస్తుంటే అన్యాయంగా జీవిస్తున్నారు.
ఈ మాట నేను చెప్పడం లేదు దేవుని వాక్యము తెలియజేస్తుంది.

ఈ లోకంలో నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు మంచి జరగాలంటే
నీకు విధేయత చాలా అవసరం కాబట్టి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండటం మీరు నేర్చుకుంటే విధేయత కలిగి జీవించడం మీకు అలవాటు అవుతుంది.
అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అంతా మంచి జరుగుతుంది.
2) తల్లిదండ్రులను సన్మానించాలి.
సన్మానించడం అంటే, ప్రేమతో గౌరవించడం.
నీ తల్లిదండ్రులను నీవు ప్రేమతో గౌరవించినప్పుడు నీవు దీర్ఘాయువును పొందుకుంటావు.
నీవు అనుకున్నది జరగాలంటే, నీ కల నెరవేరాలంటే, నీవు తలపెట్టిన ప్రతి కార్యం సఫలం కావాలంటే,
నీకు మంచి జరగాలి.
నీవు దీర్ఘాయువు తో జీవించాలి.
వీటిని దేవుడే నీకు ఇవ్వాలి, దేవుడు నీకు వీటిని ఇవ్వాలంటే నీవు దేవుని వాక్యప్రకారంగా జీవించాలి.
దేవుని వాక్యము ఏం చెప్తుంది,
మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, మీ తల్లిదండ్రులను సన్మానించాలి అని.
దేవుని మాట చొప్పున జీవించినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు.
అబ్రాహాము ఆశీర్వదించబడడానికి కారణం విధేయత.
ఇస్సాకు ఆశీర్వదించబడడానికి కారణం విధేయత.
యాకోబు ఆశీర్వదించబడడానికి కారణం విధేయత.
యోసేపు ఆశీర్వదించబడడానికి కారణం విధేయత.
దేవుని వాక్యమునకు విధేయులుగా జీవించినప్పుడు,
తల్లిదండ్రులకు విధేయులుగా జీవించినప్పుడు,
దేవుని సేవకుడిని పెద్దలను నీవు గౌరవించినప్పుడు,
తల్లిదండ్రులను ప్రేమతో గౌరవించినప్పుడు,
నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు.

యవనస్తులు అందరూ దేవుని వాక్యానికి లోబడి
తల్లిదండ్రులకు విధేయులై, తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాను.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయును గాక.

Pastor P.Barnabas

No comments:

Post a Comment

దేవుడు మనపక్షమునుండగా మనకు విరోధి ఎవడు?

Romans(రోమీయులకు) 8:31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?