Search Blogger

Friday, 30 November 2018

ఈ లోకంలో ఏది నిన్ను రక్షించదు తెలుసా?: నిన్ను రక్షించెవాడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే


Jeremiah(యిర్మీయా) 9:23,24
23.యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుజ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.
24.​అతిశ యించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
దేవుడు తన భక్తుడైన యిర్మీయా ద్వారా మనతో మాట్లాడుతున్నారు
అతిశయించడం వల్ల మన జీవితానికి ప్రమాదం ఉందని ఆ ప్రమాదం మనకు జరగకూడదని దేవుడు ముందుగానే యిర్మీయా ద్వారా నీవు అతిశయింపకూడదు అని మనతో మాట్లాడుతున్నారు.
ఒక వేళ
నీకున్న అందాన్ని బట్టి అతిశయింస్తున్నావా?
అందం మోసకరం సౌందర్యం వ్యర్థం అని దేవుని వాక్యం చెపుతుంది.
నీ అందం నిన్ను రక్షించదు తెలుసా.
నీకున్న బలాన్ని బట్టి అతిశయింస్తున్నావా?
బలవంతుడైన ఐగుప్తు రాజైన ఫరో అతని సైన్యం సముద్రం లో మునిగిపోయారు.
అతని బలం అతనిని రక్షించలెేకపోయింది.
బలవంతుడైన సమ్సోను ఫిలిష్తీయుల చెతిలో తన రెండు కల్లు పోగొట్టుకున్నాడు.
అతని బలం అతనిని రక్షించలెేకపోయింది.
బలవంతుడైన గొల్యాతు చిన్న వాడైన దావీదు చేతిలో తన ప్రాణం పోగొట్టుకున్నాడు.
అతని బలం అతనిని రక్షించలెేకపోయింది.
నీ బలం నిన్ను రక్షించదు తెలుసా.
నీకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయింస్తున్నావా?
జ్ఞానవంతుడైన సొలొమోను తన భార్యలు అతనితో విగ్రహారాధన అనే పాపం చేయించారు.
విగ్రహారాధన అనే పాపం చేయకుండా అతని జ్ఞానం అతనిని రక్షించలెేకపోయింది.
నీకున్న జ్ఞానం నిన్ను రక్షించదు తెలుసా.
నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింస్తున్నావా?
(యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక ఉపమానం చెప్పారు.)
Luke(లూకా సువార్త) 12:16,17,18,19,20
మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.
17.అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొనినేనీలాగు చేతును;
18.నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినిసమకూర్చుకొని
19.నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు,విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను.
20.అయితే దేవుడువెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.
అతని ఐశ్వర్యం అతనిని రక్షించలెేకపోయింది.
నీ ఐశ్వర్యం నిన్ను రక్షించదు తెలుసా.
ఈ లోకంలో నీకున్న ఏది నిన్ను రక్షించదు.
తన కృప చేత రక్షించి నరకం నుండి తప్పించి నిత్యజీవాన్ని ప్రశాదించేది యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే
ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడు. ఎందుకంటే నీ పాపాలకు పరిహారం చెల్లించినవాడు ఆయనే.
భూమిమీద మనుషులందరికి రక్షణ అనే కృపను అనుగ్రహించినవాడు ఆయనే.
గనుక అతిశయించువాడు ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను.
క్రీస్తుకు పూర్వం అలెగ్జాండర్ తన తండ్రి చనిపోతే పదహారేళ్ళ వయసు లో రాజయ్యాడు.
మరో పదహారేళ్లు యుద్ధం చేసి రాజ్యాలను జయించి ఇంటికి తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురై ముప్పై రెండు సంవత్సరాల వయసు లో మరణించాడు.
ఆయన మరణించడానికి కొంత సమయం ముందు ఒక నిజం తెలుసుకున్నాడు.
అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు. మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన  సైన్యం, అంతులేని సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని స్పష్టమైపోయింది.
ఇంటికి వెళ్ళాలనే కోరిక తీవ్రతరమైంది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చూపించి కన్ను మూయాలనే ఆశ. కానీ సమయం గడిసే కొద్దీ దిగజారుతున్న అతని ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు. నిస్సహాయంగా ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.
“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు.
అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.
నా మొదటి కోరిక:  ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”
రెండవ కోరిక: “నా పార్థివ దేహం  స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”
మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”
చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా  వచ్చి, ఆయన చేతులను ముద్దాడి, ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.
అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”
“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ  వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.
“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సగం భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది.అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”
“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ”
అని చెప్పి కన్ను మూశాడు.
అలెగ్జాండర్ జీవితం మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది.
ఇక్కడ విడిచి పెట్టవలిచిన వాటిగురించి ప్రయాస పడడం వల్ల ప్రయోజనం లేదు కానీ
భూమి మీద కృప చూపే దేవుడు ఆయనే అని పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి ప్రయోజనం ఉంటుంది.
నేడే తెలుసుకో
యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించు
నరకం అనే రెండోవ మరణం నుండి తప్పించబడి నిత్యజీవము పొందుకో.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయును గాక.
God bless you.


No comments:

Post a Comment

దేవుడు మనపక్షమునుండగా మనకు విరోధి ఎవడు?

Romans(రోమీయులకు) 8:31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?